అసలు నిజం :-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 ప్రేమ!  ప్రేమ!  ప్రేమ ! 
ఏది నిజమైన ప్రేమ?
ఎవరిది నిజమైన ప్రేమ? 
ఎవరు నన్ను ప్రేమిస్తున్నారు?
ఎవరు ప్రేమను నటిస్తున్నారు? 
నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళెవరు?
స్వార్ధానికి ప్రేమిస్తున్నట్లు నటించే వాళ్ళెవరు?
ఔను!
నటించేవాళ్ళు
పాలలో నీళ్ళలా కలిసిపోతారు
నేను 
హంసలా మారాలి
అప్పుడు తెలుస్తుంది
అసలు నిజం !!
**************************************


కామెంట్‌లు
Joshi Madhusudana Sharma చెప్పారు…
అవును సార్ హంసలా మారితేనే నిజం తెలిసేది. 👏👏👌🙏
Ramakrishna Patnaik చెప్పారు…
ప్రస్తుత కాలంలో ప్రేమ నిజం ఎంత?కామ సూత్ర కోణంలో దాగిన నిజమెంత?