అంబరాన్ని హత్తుకున్న వెలుగులు
సంబరాన చుట్టుకున్న మబ్బులు
ఆదరాన చుంబించి ఆలింగనముతో
ఆనందము పొందు ఆప్త మిత్రుడు
పంచిన పెరిగే ప్రేమ
వంచన ఎరుగని స్నేహం
కొంచెం అయినా అది
సంచిత పుణ్య ఫలం
మనసుకు నచ్చిన నేస్తం
మమతలు పంచే బంధం
మరువక మదిని పరిమళించు
మాయని శ్రీ చందన గంధం
గుండె గదిని అవరించిన
గుర్తు తెలియని సంతోషం
గుదిగుచ్చిన జ్ఞాపకాల
గుబాళించు పారిజాత సుమ
సౌరభం
దూరం నేరాలెంచక
దారం తెగనివ్వక
సారం బ్రతుకున నింపి
దారిన తోడుగ నడిచేది
అలకూ ఆకసానికి
ఇలకూ వెన్నెలకూ
కలకూ కన్నులకూ
కలయికన్నదే లేనిది ఈ నెయ్యం
స్నేహపు మధురిమ
పొందిన హృదయం
దైవము స్వయముగ
వెలిసిన మందిరం
మయూఖ కరచాలనానికై
చేయి సాచిన ధరణికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి