సుప్రభాత కవిత : -బృంద
పాల నవ్వులు రాశి పోసినట్టు 
పూల పరిమళం చుట్టు ముట్టినట్టు
నేల పచ్చని చీర కట్టినట్టు 
వేల కాంతులు కలిసి కురిసినట్టు

మేలిముసుగై వెండి మబ్బులు 
నీలి నింగికి శోభ నిచ్చినట్టు 
తెలిమంచు శిఖరము పైన 
వాలి సేద తీరుతున్నట్టూ

ధరకు దిగిన దివిజ గంగ
సరోవరపు సొగసు చూసి 
పరవశించి సంగమించ
బిరబిరా కదిలి వచ్చి చేరినట్టూ

ఎవరి ఊహకూ అందనట్టి 
ఎవరి చేతి కుంచె సృష్టి ఇది?
ఎంత చక్కని వసుమతి!
దైవమొసగిన  బహుమతి!

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు