న్యాయములు-699
శ్మశాన వైరాగ్య న్యాయము
*****
శ్మశానము అంటే వల్లకాడు, కాడు, కాష్టం అని అంటారని తెలుసు. వైరాగ్యం అంటే విరక్తి.ఇంద్రియాలకు సంబంధించిన వాటి పట్ల కలిగే విముఖత,పరిత్యాగాన్ని వైరాగ్యం అంటారు.
శ్మశానానికి శవాన్ని తీసుకుని వెళ్లి దహనమో ఖననమో చేసినప్పుడు కలిగే వైరాగ్యం.
ఆత్మీయులో, బంధువులో, స్నేహితులో, తెలిసిన వారో పోయినప్పుడు అంతిమ నివాళి అర్పించేందుకు శ్మశాన వాటిక వరకూ వెళ్తుంటాం.అక్కడ దహన సంస్కారాలు చేయడమో,చూడటమో జరుగుతుంది.ఆ సమయంలో చాలా మందిలో ఒకలాంటి వైరాగ్య భావన కలుగుతుంది."
బతికున్నంత కాలం అది కావాలి ఇది కావాలని తాపత్రయ పడుతూ వుంటాం.ఏం కట్టుకు పోతాం?చివరికిలా పిడికెడు బూడిదో, ఆరడుగుల నేలో కదా !ఈ భార్యాబిడ్డలు, ఋణానుబంధాలు,కక్షలు కార్పణ్యాలు బతికి ఉన్నంత కాలమే... పేద గొప్ప తేడా లేకుండా ఇక్కడ అంతా ఒక్కటే కదా! ఎందుకో? ఈ అంతరాలు, తేడాలు అని...
ఈ విరక్తి భావన మనసును కుదిపేస్తుంది. ఈ జీవితం శాశ్వతంకాదనీ, ఎప్పటికైనా, ఎవరికైనా చావు తప్పదు కదా!ఇక నుండైనా ఇలా ఉండాలి అలా ఉండాలని మనసు రకరకాల నిర్ణయాలు చేస్తుంది.
ఈ విధంగా ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి వారికీ అలాంటి సమయంలో విరక్తితో పాటు అంతులేని విచారం కలుగుతుంది.
"ఆలుబిడ్డలు మాయ- అన్న దమ్ములు మాయ- ఈ బతుకే పెద్ద మాయ, గాలి బుడగ జీవితం. ఎప్పుడు టప్ మంటుందో తెలియదు.ఇలా అనుకుంటూ తోటి వారితో మాట్లాడుతూ విచారం,విరక్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు.
ఆ సమయంలో గుర్తుకు వచ్చే ఓ వేమన పద్యాన్ని కూడా చూద్దాం.
"ఏమి గొంచు వచ్చె నేమి తా గొనిపోవు/ బుట్టు వేళ నరుడు గిట్టు వేళ/ ధనము లెచట కేగు దానెచ్చటికి నేగు/విశ్వధాభిరామ వినురవేమ!"
మనిషి పుట్టేటప్పుడు ఏమీ తీసుకుని రాడు. పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోడు.అప్పుడు ఈ సంపదలెటు పోతాయో ,తానెటు పోతాడో తెలుసుకోలేడీ మానవుడు అంటారాయన.
మరి ఇలాంటి తాత్విక భావనలు అలాగే కొనసాగుతాయా? అంటే అస్సలు కొనసాగవు.ఆ శ్మశానంలో ఉన్నంత వరకే. బయటికి వచ్చిన తరువాత షరా మామూలే.
ఆశలు కోరికలు కోపాలు తాపాలు పగలు పట్టింపులూ అన్నింటితో మనిషి నిత్యాగ్ని హోత్రంలా రగులుతూనే వుంటారు.
మరీ దగ్గరి వారైతే మాత్రం ఆ వ్యక్తితో ఉన్న బంధం బాధ,కొంత కాలం వెంటాడుతూ వుంటుంది.ఆ తర్వాత్తర్వాత గడిచే కాలమూ, అది కలిగించే మరుపు, దైనందిన జీవితం మనిషిని యథా స్థితికి తీసుకుని వస్తుంది.
ఇలా తాత్కాలికంగా కలిగే వైరాగ్యాలు మరో రెండు ఉన్నాయి.అవే పురాణ వైరాగ్యం మరియు ప్రసూతి వైరాగ్యం.
విన్నంత సేపు,కన్నంత సేపు ఆ పరిస్థితి అనుభవించినంత సేపే ఇలాంటి వైరాగ్యాలు చుట్టుముడుతుంటాయి.ఆ తర్వాత మళ్ళీ మామూలే.
శ్మశాన వైరాగ్యం వల్ల మనసులో వచ్చిన తాత్త్విక ,ఆధ్యాత్మిక భావనలను అక్కడితో వదిలేయకుండా మనలో మంచి మార్పుకు శ్రీకారంలా ఉపయోగించుకుందాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి