తొట్టంబేడు మండలం లోని దిగువ సాంబయ్య పాళెం ప్రాథమిక పాఠశాల లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం జరిగింది.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆమోదింప బడి నేటికి 75 సంవ త్సరాలు పూర్తి అయ్యిందని, ఈ రాజ్యాంగం ద్వారా సర్వ సత్తాక,సామ్య
వాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్రం
గా ప్రకటించుకున్నామని ,భారత పౌరునిగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను గౌరవించాలని అన్నారు.
అనంతరం పిల్లలచేత రాజ్యాంగ ప్రతిజ్ఞ
చేయించి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల తో నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో హెచ్.ఎం.జ్యోతి,
విద్యార్థులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి