చిత్రలేఖనం అనే కళ పరిశీలనా శక్తిని మెరుగుపర్చునని, విద్యార్థులకు ఈ కళ ఎంతగానో అవసరమని జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర గ్రంథాలయ శాఖ నిర్దేశాల మేరకు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో నాల్గవరోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసారు. వారోత్సవాలలో భాగంగా నేడు విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు తిరుమలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ సైన్స్ బొమ్మలు, ప్రపంచ పటాలు, రేఖాగణిత మెళకువలు, చరిత్ర కారుల చిత్రాలు, రంగవల్లులు, పేజీ అలంకరణలు, దస్తూరీ వ్రాత వంటివి ఈ చిత్రలేఖనం కళ ద్వారా సాధించవచ్చునని అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రంథాలయాధికారి యాండ్రాపు అమరనాథ్ మాట్లాడుతూ మిక్కిలి పారదర్శకతతో చిత్రలేఖన నైపుణ్యం అలవడుతుందని, పరీక్షలలో ఎక్కువ మార్కులు వచ్చేలా బాలబాలికలకు ఈ చిత్రకళ దోహదపడుతుందని అన్నారు. ఈ పోటీలకు పలు పాఠశాలల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఎల్. గణేష్, ఎమ్.హర్షిణీప్రియ, బి.గౌతమీలతలు నిలిచారు. వీరికి ఈనెల 20న ముగింపు సమావేశంలో బహుమతి ప్రదానం గావించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా కుదమ తిరుమలరావు, వై.అమరనాథ్, డాకోజి రమణమ్మలు వ్యవహరించారు. దీసరి రత్న కుమార్, కారు త్రినాథరావు, కొమ్మనాపల్లి ఉమామహేశ్వరరావు, దాలి లక్ష్మణరావు, ముదిలి మణికంఠ నాయుడు, బత్తిన ఉమాశంకర్ ల పర్యవేక్షణలో ఈ పోటీలు జరిగాయి. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
పరిశీలనా శక్తిని పెంపొందించేది చిత్రలేఖన కళ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి