శ్లో:! కారుణ్యామృతవర్షిణం ఘనవిపద్గ్రీష్మఛ్ఛిదా కర్మఠం
విద్యాసస్యఫలోదయాయ సుమనస్సంసేవ్య మిఛ్ఛాకృతిమ్
నృత్యద్భక్తమయూర మద్రినిలయం
చంచజ్జటామండలం
శంభో వాంఛతి నీలకం ధర సదా త్వాం మే మనశ్చాతకః !!
భావం: హే శంభో,! నీలకంధరా ! కరుణానిధి అమృత వర్షమును కురిపించు వాడవును, మహా విపత్తులు అనెడి సంతాపాన్ని తొలగించు వాడా!
విద్య అనెడి పైరు పండుటకు సహాయము చేయువాడా! దేవతలు, సజ్జనులు చేత చక్కగా కీర్తింపబడు వాడా! ఇష్టమువచ్చు ఆకారము ధరించు వాడా! నాట్యం చేయు నట్టి నెమళ్లు కలవాడా !పర్వతం పైన నివసించువాడా! చక్కగా ప్రకాశించు జడలు కలవాడు అగు నిన్ను నా మనసు చాతకపక్షి వలె కోరుచున్నది.
******
శివానందలహరి:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి