తెలుగుభాష
కార్పొరేట్ కర్ఫ్యూ కు గురైంది
తెలుగుభాష
కనిపిస్తే కాల్చివేతకు గురైంది
తెలుగుభాష
144 సెక్షన్ కు గురైంది
ఇంగ్లీషుకు రాజరికం ఇచ్చి
తెలుగును బిచ్చగత్తెను చేశారు
పొలాల వెంబడి హలాల మూగరోదన
మట్టికాళ్ళకు అనుమతిలేదని
"షూ" తొడుక్కున్న నీటుగాళ్ళనుమాత్రం
భుజానెత్తుకుని ఊరేగిస్తున్నారు
తెలుగంతా ఓల్డయిందని
అధికార ఉత్సవాల్లో కాటువడ్డ
మేకపిల్లయింది
ఇంగ్లీషునంతా
నిత్యనూతన నిర్నిద్రగానం చేస్తున్నారు
అయినా
మసిగుడ్డలో మాణిక్యంలా
నా తెలుగు మెరుస్తూనే ఉంది
మా మట్టిపూల అందాలు
మా మట్టిపూల పరిమళాలు
ఎక్కడబోతయి మరి?!
**************************************
కార్పొరేట్ కర్ఫ్యూ కు గురైంది
తెలుగుభాష
కనిపిస్తే కాల్చివేతకు గురైంది
తెలుగుభాష
144 సెక్షన్ కు గురైంది
ఇంగ్లీషుకు రాజరికం ఇచ్చి
తెలుగును బిచ్చగత్తెను చేశారు
పొలాల వెంబడి హలాల మూగరోదన
మట్టికాళ్ళకు అనుమతిలేదని
"షూ" తొడుక్కున్న నీటుగాళ్ళనుమాత్రం
భుజానెత్తుకుని ఊరేగిస్తున్నారు
తెలుగంతా ఓల్డయిందని
అధికార ఉత్సవాల్లో కాటువడ్డ
మేకపిల్లయింది
ఇంగ్లీషునంతా
నిత్యనూతన నిర్నిద్రగానం చేస్తున్నారు
అయినా
మసిగుడ్డలో మాణిక్యంలా
నా తెలుగు మెరుస్తూనే ఉంది
మా మట్టిపూల అందాలు
మా మట్టిపూల పరిమళాలు
ఎక్కడబోతయి మరి?!
**************************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి