సుప్రభాత కవిత : -బృంద
మనసు మాటున వున్నదేదో 
కనపడనీయని  భయమైతే 
కనులు కన్న కలలేవో 
రెప్పలకు తెలియవా?

పెదవి దాటని మాట ఏదో 
మదిని దాటే మాయ చేస్తే 
పొదివి పట్టి పొరల దాచిన 
ఎదకు తెలియకుంటుందా?

ఊహకందక వేధిస్తున్న 
ఊయాలూపే  ఊసేదో 
ఊపిరూది  పెంచుతున్న 
అంతరంగం ఎరుగదా?

పొగమంచు పాతరేస్తే 
జగము మునిగిపోవునా?
సెగచూపి కరిగించే 
కిరణానికి తెలియదా?

కాలమిచ్చు కానుకేదో 
తెలియలేని కలత 
కాస్త సేపు ఆగిచూస్తే 
వేకువొచ్చి ఇవ్వదా?

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు