గౌరవ శ్రీ . ఎనుముల రేవంత్ రెడ్డి గారు
తెలంగాణ ముఖ్యమంత్రి,
హైదారాబాద్, తెలంగాణ రాష్ట్రం.
విషయం : విద్యా హక్కు చట్టాన్ని మరియు బాలల విద్యను దృష్టిలో ఉంచుకొని “సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే” నుండి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి
ఆర్యా !
రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన “సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే” కోసం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సేవలను తీసుకోవడానికి విద్యాశాఖప్రధాన కార్యదర్శి 1.11.2024 నాడు మెమో నెంబర్ 1112 ద్వారా 36,559 SGT ఉపాధ్యాయులను, 3414 ప్రధానోపాధ్యాయులకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా పాఠశాలలను ఉదయం 9 గంటల నుండి మ. 1 గంటల వరకే (ఒంటి పుట)నే నిర్వహించాలని ఈ ఉత్తర్వుల సారాశం.
ప్రభుత్వ పాఠశాలపై దిగజారుతున్న విశ్వాసానికి ఈ ఆదేశాలు తల్లిదండ్రులలో మరింత ఆవేదనకు గురి చేస్తుంది. విద్యా హక్కు చట్ట ప్రకారం సంవత్సరం లో ప్రాథమిక పాతాశాలలు 200 పనిదినాలు మరియు 8౦౦ బోధనా గంటలుగా నిర్దారించాడమైనది. అంతే కాకుండా ఉపాధ్యాయులకు జనాభా గణన లెక్కలు, ప్రకృతి వైపరిత్యాలలో సహాయ విధులు మరియు పార్లమెంటు, రాష్ట్ర శాసన సభ, స్థానిక ప్రభుత్వాలకు జరిగే ఎన్నికలకు సంబందించిన విధులను మినహాయించి టిచర్లను ఏ ఇతర విద్యేతర పనులకు పంపకూడదని విద్యా హక్కు చట్టం నిర్దేశిస్తుంది.రాష్ట్ర ప్రభుత్వం కుల గణన కోసం ఉపాధ్యాయులను వినియోగించుటకు జారీచేసిన ఉత్తర్వులు విద్యా హక్కు చట్ట ఉల్లంఘన కిందికి రావడమే కాకుండా బాలల విద్యా హక్కు ను కూడా ఉల్లంగించినట్లు అయితుంది.
మనందరికి తెలుసు ప్రభుత్వ బడులలో చదివే పిల్లల తల్లిదండ్రులు అత్యధిక శాతం కూలి నాలి చేసుకునే వారే .దళిత బహుజనులే . సగం పూట బడులు నడపడం వలన పిల్లలు ఇంటికి వస్తే ఎవరు ఉండరు కాబట్టి ఆ సగం పూట కూడా బడికి కాకుండా పనికి వెళ్లే తల్లిదండ్రులు పిల్లలను తమ వెంట తీసుకుపోతారు . చాలా ప్రమాదం ఈ చర్య. మళ్లీ బడులకు రావడం అలవాటు కు సమయం పడుతుంది. దసరా దీపావళి పండుగల తరువాత ఇంకా అందరు పిల్లలు బడులకు తిరిగి రాలేదు. అంతలోనే ఈ సర్వే పనుల వలన బడులు మూత. పిల్లల సామర్థ్యాల పై చాలా ప్రభావం పడుతుంది .
అసలే నాణ్యమైన విద్య అందించడంలో రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ అచీవ్ మెంట్ సర్వే (NAS) నివేదిక ద్వారా తెలియ వచ్చింది. ఇక ప్రభుత్వ పాఠశాలలల్లో ఎస్ సి, బి సి, ఎస్టీ సామజిక వర్గాల విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు ఇంకా ఎక్కువ ఆందోళనకరంగా ఉన్నాయి. మొత్తంగా ఈ మన రాష్ట్రం, అన్ని రాష్ట్రాలలో కంటే మన రాష్ట్రం బాలలు తక్కువ అభ్యసన సామర్ధ్యాలు కలిగి ఉన్నారు.
ఈ మద్యనే మీ ప్రభుత్వ హయాంలో నాణ్యమైన విద్య అందించడానికి వేలాది మంది ఉపాధ్యాయులను నియమించి నందుకు తల్లిదండ్రులు ఫౌర సమాజం హర్షించింది. కాని ఈ సంతోషం ప్రాథమిక పాతశాల్ల ఉపాధ్యాయులను బోదనేతర పనులు అప్పజెప్పడం వలన విద్యార్థుల బోధన కుంటుపదడమే కాకుండా విద్యార్థులు బడిమానేసి ప్రమాదం ఎంతైనా ఉంది. విద్యా హక్కు చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుండి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయించాలని విజ్ఞప్తి
ఇట్లు
ఆర్. వెంకట రెడ్డి
జాతీయ కన్వీనర్, ఎం. వి. ఫౌండేషన్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి