ఆకాశంలో సగమో సాంతమో చెప్పలేనుకానీ అవనిల ఊరి ప్రాణం
లింగ భేదాలకు ఆవల నేను
అనిర్వచనీయం
చూపు ఎంత పదునో పాళీనడగాలి
రూపు సుందరమెంతో సిరాకే తెలుసు
మాయామేయ శరీంరంలో గుండ్రంగా తిరిగే భూమ్మీద
మెదడూ మనసుతో బతీకే ఒకేఒక గుండెకాయ ప్రపంచం నేను
అమ్మ కొంగు సావాసం నాది
నారి కడకొంగు క్రీగంట పారేటి నునువెచ్చని కాంతిధారను
ఆటలో ఆటను
పాటలో పాటను నేను
చూడగలిగే శక్తులకు వ్యక్తులకు
ఎప్పుడూ తెరిచిన పుస్తకం నేను
భాషలెన్నో భావాలెన్నో
సృజన అనుసృజనల ఎదమీటే
అక్షరాంతరంగ తీగల వీణను నేనే
అమేయం అనంతం నా దారి
అడ్డం నిలువూ ఎదీ కాదు అడ్డంకి
మహారణ్యంలోనూ జనారణ్యంలోను విసిరేయబడ్డ క్షిపణి నేను
అంతరిక్ష సంచారి స్పేస్ షటిల్ ను గ్రహాంతర రేసుల
భావాలలల్లిన మేనా మోసే ఉద్వేగ కవిత్వాన్ని
సామాజిక నేపథ్యంలో విహరించే
మౌన ప్రవాహ దాహాన్ని
ఓ కోకిల ఓ కాకి ఓ చిలుక ఓ జీవి నేను
కుల్లంకుల్లంగా
స్వేచ్ఛ రెక్కల ఊపిరి పక్షిని
ఊరి నీడ చెట్టు
ఆకుపచ్చంచు చీర ఊగే చేతుల కొమ్మ నేను
మనిషి అనంత అంతరంగ ఆకాశంలో మేఘపుటంచుల ఊగే
నునువచ్చని జవ్వని కురుల వాలే కవితను
మట్టి పిండిన గుండె తడి గుడిసె నేను
ఒక ఆశను ఒక ఆశయాన్ని ఒక ఆలోచననూ విసిరే శతారాన్ని నేను
మనిషిచుట్టూత చుట్టుకున్న అక్షరాయుధాన్నీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి