అక్కా -తమ్ముడు ...!: -డా.కె.ఎల్.వి.ప్రసాద్.

 అక్క ఆన్షి ని 
అందరిని సంభోదించినట్టే 
' అమ్మా ..! ' అనేవాడు 
మనవడు 'నికో '
ఇప్పుడు 'అక్కా ..'
అంటున్నాడు ....!
అంతమాత్రమే కాదు ,
ఒకమెట్టు పైకెక్కి ....
' అక్కపిల్లా ' అని 
పిలుస్తున్నాడు ...!
అక్కతో ఆడడానికి ...
బహుగాఇష్టపడతాడు ....
అక్కకనపడితే చాలు 
సంతోషపడిపోతాడు !
ఈ అక్కా-తమ్ముళ్ల ప్రేమ ,
' టి.వి' దగ్గర తప్ప ....
కొలబద్దలేనిది ....!
ప్రతి విశయం లోనూ
గెలుపు గుర్రం నాదే అన్నట్టు ,
అనుకున్నది సాధిస్తాడు,
నల్లి వంశోద్దారకుడు,
మా బుజ్జి నికో బాబు!!
              ***
కామెంట్‌లు