ఊరుగాలి ఈల:-డా.టి.రాధాకృష్ణమాచార్యులు
స్నేహాలు బంధాలు తీరని క్షేత్రం
కొన్ని గత జల సేతు బంధన గీతం
కలల నింగీనేల సమ్మేళనం   అపూర్వం

మట్టి ఎగిసిన గాలి గంధం ఈల
చిట్టిపొట్టి చిన్నారి అందాల జోల
మనిషిగ పుట్టిన మట్టి సందడి ఊరు

నిన్న మొన్నటి అనుభవం జీవకళ
రేపటి ఊహల లోకం ఆశల దీపం
వర్తమాన దారి భావోద్వేగాల సేద్యం

నాన్న నడకల బడి అద్భుత సంగీతం
సోపతుల చదువు ఊరేగే ఊరు
సమయపాలన క్రమశిక్షణలో ప్రతిజ్ఞ బరాబర్

చదువుల పుస్తకం తెరిచే పేజీలు
బతుకు దారి తీర్చిదిద్దిన అడుగులు
గురువొ వంచిన బోధలే చెక్కిన జీవనతాత్పర్యం

భయం భయంగా బడికెళ్ళిన మనసు
అభయహస్తం నిమిరిన తల ఆలోచన
బడికెళ్ళడంలో రగిలింది బతుకు పాఠం

బెత్తం సరిచేసిన నడకలన్నీ గొప్పవే
స్థిరమైన రేపటి ఆశల పాటలు
పడిలేచే లేలేత కెరటాలు బడి వొడిలో


కామెంట్‌లు
prasadklv చెప్పారు…
మీ దీర్ఘ కవిత చక్కగా సాగుతున్నది.కొనసాగించండి.అభినందనలు.
అజ్ఞాత చెప్పారు…
జీవితాన్ని నె మరు వేయడం, వర్తమానాన్ని అనుభవించడం, భవిష్యత్తు ను సరిగ్గా ఊహించి తగిన స్టెప్స్ తీసుకోవడం కొందరు విజ్ఞ్యులకు మాత్రమే సాధ్యం. కవిశ్వర్లు చక్కని ఉపమానాలతో విశ్లేశిం చారు. Abhinandanalu