న్యాయములు-679
వృకబంధన న్యాయము
*****
వృక అంటే అంటే తోడేలు,నక్క,కాకి. బంధన అనగా బంధించుట,కట్టుట ,కట్టు,సంకెల, చెరసాల,తొడిమ లేదా పట్టుకొనుట.
వృక బంధన అనగా తోడేలు , లేదా నక్కను పట్టుకునే ప్రయత్నం చేయుట.
ఇదో సరదా సరదా కథ. అడిగే "వాడికి చెప్పేవాడు లోకువ" అనే ఓ సామెత ఉంది. అలాగే "దున్నపోతు ఈనిందంటే ఎక్కడ కట్టేయాలని అడిగినట్లు".. అలాంటి కోవకు చెందినదే ఈ న్యాయము.
ఒకానొక అమాయక వ్యక్తి లేదా వెర్రి వెంగళప్ప ఓ తెలివున్న పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళి "తోడేళ్ళను ఎలా పట్టుకోవాలి?" అని అడిగాడు. అప్పుడు ఆ తెలివున్న పెద్ద మనిషి అంటే చాలా చతురుడు అన్నమాట. అప్పుడా అమాయక వ్యక్తితో " కొంగ నెత్తిమీద పేరిన లేదా గడ్డకట్టిన నెయ్యి పెట్టి వుంచు.ఎండకు ఆ నెయ్యి కరిగి దాని కళ్ళలోనికి పోతుంది.అప్పుడది కళ్ళు కనబడక కంగారు పడుతుంది.అదిగో అప్పుడే దానిని సుళువుగా పెట్టుకోవచ్చు "అని చెప్పాడు.
దాంతో వెర్రి వెంగళప్పకు కూడా అర్థమయ్యీ కానట్టయి తికమక పడుతూ బిత్తర చూపులు చూస్తాడు .
అలాగే ఆ వెర్రి వెంగళప్పకు మరో సందేహం కూడా కలుగుతుంది. అదేమిటంటే "దోమను ఎలా చంపాలి? అప్పుడా తెలివైన, చతురుడైన పెద్ద మనిషి " ఆ ఏముంది దోమను పట్టుకొని దాని నోటిలో ద్రావకం పోస్తే అది సులభంగా చచ్చి పోతుంది." అని చెబుతాడు.
మరో వెర్రి వెంగళప్పను గద్దె ఉన్న గిన్నెలో నూనె పట్టుకొని రమ్మంటే నూనె తెస్తూ 'అరే అమ్మ చెప్పింది కదా! కొసరు కొంత పోయించుకు రమ్మనమని' వెనుక వైపు ఉన్న గద్దెలో పోయిద్దాం' అని ఆ గిన్నెను వెనక్కి తిప్పితే ఏముందిక నూనె అంతా ఒలికి పోయింది.అదేమీ పట్టించుకోకుండా ఆ గద్దెలో పోయించుకుని కొసరు మరిచి పోకుండా తెస్తున్నానని తృప్తి పడతాడా అమాయకుడు. అలా వుంటుంది కొందరి అమాయకత్వం.
"మరి ఇది కూడా ఓ న్యాయమా? దీన్ని చెప్పాల్సిన అవసరం ఎవరికైనా వుందా? అసలు ఎవరైనా ఇలాంటి ప్రశ్నలు అడుగుతారాళశఅని అనిపిస్తుంది.
పెద్ద వాళ్ళు చెప్పే ప్రతి విషయం లేదా మాట వెనుక ఓ జీవిత సత్యం దాగి వుంటుందనేది మరువకూడదు.
మన చుట్టూ ఉన్న సమాజంలో అందరూ తెలివికల వారే ఉండరు. కష్టించి పని చేయడం తప్ప మరే ఇతర విషయాలు తెలియని అమాయక చక్రవర్తులు ఉంటారు. వాళ్ళను గురించి "కుడుము ఇస్తే పండుగా "అని అడిగేంత అమాయకులు, "పిచ్చి కుదిరింది అని డాక్టర్ అంటే "రోకలిని తలకు చుట్టుకోవాలి తీసుకుని రా అనేవాళ్ళు" ఉంటారు.ఇలాంటి వారిని తేలికగా మోసం చేయవచ్చు. ఎందుకంటే ఎవరేం చెప్పినా ఇట్టే నమ్మేస్తారు. విసుక్కోకుండా జవాబు చెప్పేవారంటే వారికి చాలా ఇష్టంగా వుంటుంది.
కాబట్టి పై విషయాలన్నీ గమనించిన తర్వాత ఇలాంటి వారిని మోసపోకుండా కాపాడాల్సిన మన అందరి బాధ్యత. అంతే కదండీ!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి