న్యాయాలు -648
మూషాసిక్త తామ్ర న్యాయము
****
మూషా అంటే మూస.సిక్తము అంటే తడిసినది.తామ్రము అంటే రాగి,ఎఱుపు, ఎఱ్ఱనిది అనే అర్థాలు ఉన్నాయి.
"చక్షురాది ద్వారా బహి ర్నిఃసృత స్యాంత కరణస్య మూషా/సిక్త తామ్ర న్యాయేన విషయాకారతా భవతి."
అనగా చక్షురాదుల అంటే కన్నులు మొదలైన వాటి ద్వారా బహిర్గతమయిన అంతఃకరణమునకు మూషాసిక్త తామ్రమునకు వలె విషయకారత్వం కలుగుతుంది "అనే విషయం ఈ క్రింది విధంగా కూడా తెలుపబడింది .
"మూషాసిక్తం యథా తామ్రం తన్నిభం జాయతే తథా,రూపాదీ న్వ్యాప్ను వచ్చిత్తం తన్నిభం దృశ్యతే ధృవమ్ "అని ఆచార్యుల వారి - ఉపదేశ సాహస్రిలో రాయబడింది.
మొత్తం మీద ఈ శ్లోకాల అంతరార్థం గమనించినట్లైతే...
రాగి చెంబులు పోత బోయు వ్యక్తి ముందుగా రాగిని బాగా కరిగించి కావాలనుకున్న ఆకారం గల మూసలో పోస్తాడు. వెంటనే అది ఆ మూస యొక్క ఆకారమును పొందుతుంది.
అలాగే మన చిత్తము లేదా మనసును కూడా ఎలాంటి వ్యవహారాది గుణ ,రూపాలకు సంబంధించిన మూసలో పోస్తే అలాంటి గుణ రూపాలను పొందిన మనసు బయటికి వ్యక్తం అవుతుందన్న మాట.
అంటే మనసనే రాగి లోహంలో దశేంద్రియాలనే ఉక్కు లాంటి కణాలు ఉంటాయి.వాటిని తామ్రంతో పాటు కరిగించి మన తెలివితేటలతో బహిర్గతం కావాలని, మేధస్సుతో సమాజానికి మేలు చేయాలని కోరుకుంటాం.కానీ చంచలమైన మనసునూ అందులోని అరిషడ్వర్గాల ఇంద్రియాలను కరిగించడం అంత తేలికైన పనేమీ కాదు కానీ అలాగనీ అసాధ్యం కూడా కాదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన శ్లోకం చూద్దాం.
"అసంశయమ్ మహా బాహో మనో దుర్నిగ్రహం చలం /అభ్యసేన తు కౌంతేయ వౌరాగ్యేన చ గృహ్యతే "
చంచలమైన మనసును స్వాధీనంలోకి తెచ్చుకోవడం, అదుపు చేయడం కొంచెం కష్టమే కానీ దాన్ని తగిన సాధన/ అభ్యాసం మరియు వైరాగ్య భావనతో తప్పకుండా సాధ్యం అవుతుంది."అంటాడు.
ఆ విధంగా మన బుద్ధి అనే సాధనతో కరిగించిన మనసును మనకు ఇష్టమైన మానవతా ఆధ్యాత్మిక మూసలో పోస్తే అది ఆ రూపమే లోకానికి బహిర్గతం అవుతుంది.
ఇదేమిటి గందరగోళంగా అనిపిస్తుంది అనుకుంటే మరో చిన్న ఉదాహరణ చూద్దాం .అది మనందరికీ తెలిసిందే.
ఓ బోయవాడు తాను పట్టిన రెండు చిన్ని చిలుకలలోఒకటి ఆశ్రమంలో ఉన్న మునికి, మరొకటి మాంసం అమ్మే వ్యక్తికి ఇస్తాడు.
కొద్ది రోజుల తర్వాత అవి ఎలా పెరుగుతున్నాయో చూద్దామని వెళతాడు.ఆశ్రమంలో పెరిగిన చిలుక చక్కని విలువలతో పెరగడం. మరో చిలుక మాంసం అమ్మే వ్యక్తి మాటలనే (పట్టండి, కొట్టండి, చంపండి) అనడం చూస్తాడు.
అంటే ఇక్కడ గ్రహించ వలసింది మొదటి చిలుక విలువల మూసలో పోయబడి ఆ విధంగా తన గుణాలను బహిర్గతం చేసింది.
రెండో చిలుక అక్కడ ఉన్న అమానవీయత అనే మూసలో పోయబడి అదే విధంగా బహిర్గతం అయ్యింది.
మన మనసు అనే చిలుకను ఏ విధంగా తీర్చి దిద్దితే ఆ విధంగా తయారవుతుంది అనే నిగూఢమైన అర్థం ఈ "మూషాసిక్త తామ్ర న్యాయము"లో ఇమిడి ఉంది.
ఇందులో ఆధ్యాత్మిక చింతనతో పాటు ప్రాపంచిక విలువలు, విషయాలు ఉన్నాయని గ్రహించాలి .
ఆ విధంగా మన మనసును మంచి రూపంలో వ్యక్తం అయ్యేలా "మూషాసిక్త తామ్రము" వలె విషయ కారత్వం పొందుదాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి