అంధకుడు నిజానికి శివపార్వతుల కొడుకు.కళ్లు కన్పడవు. సంతానంలేని హిరణ్యాక్షుడు పెంచుకున్నాడు. అందుకే అంధకాసురుడైనాడు. వాడు బ్రహ్మనుగూర్చి తపస్సు చేసి" నాకు ఒక కన్ను ఇవ్వు.చావులేకుండా చేయి" అని కోరాడు.చావును తప్పించటం అసాధ్యం కానీ పార్వతిని కామిస్తే చావుతప్పదని బ్రహ్మ అంతర్ధానమైనాడు. తల్లి పార్వతిపైనే కన్నేసిన వాడికి మూడింది.
ఇక దేవతలకు ఎప్పుడూ రాక్షసులతో యుద్ధంతప్పదు. విఘతుడు అనే దానవుడ్ని నంది మింగేశాడు. రాక్షసులంతా చస్తుంటే శుక్రాచార్యుడు వారిని బతికిస్తున్నాడు. ఎందుకంటే వాడు దేవతల్ని సతాయిస్తున్నాడు కాబట్టి.ఇలా శుక్రాచార్యుడి వల్ల రాక్షసులు బతకడంతో శివుడు అతన్ని మింగి తన ఉదరంలో దాచాడు. ఇక అంధకాసురుడు చకచకా మింగుతున్నాడు దేవతల్ని.శివుడు కోపించి తన త్రిశూలంతో వాడి పొట్టని నొక్కడంతో బ్రతుకుజీవుడా అంటూ దేవతలు బైట కి రావటం జరిగింది.దానవుల్ని తుదముట్టించారు. వారిని బ్రతికించే దైత్యగురువు శుక్రుడు శంకరుని ఉదరంలో ఉన్నాడుకదా? అంధకుడు త్రిశూలం తనని గుచ్చుతుంటే బుద్ధి జ్ఞానోదయం కల్గింది."అయ్యో! జగన్మాత పార్వతిని కాముకదృష్టితో చూసిన పాపాత్ముడ్ని" అనిత్రిశాలంపై పడుకుని శివస్తోత్రం చేశాడు.శివుడు వాడిని తన ఒక గణానికి అధిపతిగా చేశాడు.శివకింకరునిగా మారాడు.మనలోని అన్యాయ కుటిలమైన ఆలోచనలే రాక్షసులు.ఇప్పుడు వయసుతో సంబంధంలేకుండా ఆడవారిపై అత్యాచారాలు జరుగుతున్నాయి కదా? వాళ్లే రాకాసులు. ఇకశుక్రాచార్యుడు శివుని పొట్ట లోంచి ఎలుగెత్తి ప్రార్థన చేయడంతో బోళా శంకరుడు తనశుక్రకణం విడుదలయ్యే ద్వారంగుండా అతన్ని బైటకి పంపాడు. అలా దానవగురుడు బైట పడ్డాడు.అసలు అతని పేరు భార్గవుడు. కానీ ఈసంఘటనతో శుక్రుడు శుక్రాచార్య అని రాక్షస గురువుగా ప్రసిద్ధుడైనాడు 🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి