ఆశ ....!!: --డా.కె .ఎల్ .వి.ప్రసాద్

 అమ్మా ..అంటాడు ...
అమ్మను ' అమ్మా ' అని పిలవడు !
అక్కా ...అంటాడు ...
అక్కను ' అక్కా 'అనిపిలవడు !
అమ్మూ ..అంటాడు.
అమ్మమ్మను 'అమ్మూ 'అనిపిలవడు !
తాతా ...అంటాడు .....
తాతను 'తాతా ' అనిపిలవడు ...!
డాడీ ..అంటాడు ...
తండ్రిని 'డాడీ ' అని పిలవడు !
అందరినీ 'అమ్మా 'అనిపిలిచే 
మా మనవడు ' నికోబాబు '
పూర్తిమాటలువచ్చి ...
ప్రేమగా ఎప్పుడు పిలుచునొకదా ...!
మాటలతో ఎప్పుడు మురిపించునొకదా !!

కామెంట్‌లు