శివానందలహరి:-కొప్పరపు తాయారు
 

శ్లో:! సంధ్యారంభ   విజృంభితం  శృతి శిరః 
    స్థానాంతరాధిష్టతం
    సప్రేమ  భ్రమరాభిరామ మసదృత్సద్వాసనా
   శోభితం
   భోగీంద్రాభరణమ్  సమస్త. సుమనః పూజ్యం 
  గుణావిష్కృతం
 సేవే శ్రీ గిరి మల్లికార్జున మహాలింగం 
    శివాలింగీతం !!

భావం! సంధ్య ఆరంభము నందు విశేషముగా ప్రకాశించు వాడును, ఉపనిషత్తులను, స్థాన విశేషములను, ఆశ్రయము గా చేసుకుని ప్రేమతో కూడిన భ్రమరాంబికతో సహా విరాధిల్లు వాడును,
ఎల్లప్పుడూ మంచి భావనతో ఉండువాడును,   ప్రేమతో  ఉద్దరిణి నీరును పోసిన వాడునూ, 
ఏ విధముగా తనను పూజించినా వారిని అనుగ్రహించవలెనని మంచి భావన కలవాడు 
ఆశుతోషుడు అని భావము. వాసుకి ఆభరణము గా గలవాడును, దేవతలు చే పూజించబడువాడును. పార్వతి దేవి చే ఆలింగనము చేసి కొనబడిన వాడును. శ్రీశైల మున మల్లికార్జునుడు అని పేరున వెలసిన జ్యోతిర్లింగమును పూజిస్తాను. 
                     ******

కామెంట్‌లు