పనిపాటల సంతకం కూలిన గోడలు
ఒగిర్చే మనసుల ఉడుకపోత మేడలు
బతికిన వృత్తులన్నీ చచ్చువడ్డ చూపులు
కాకి కోకిలలు బతికిన చెట్టు
గుమ్ముల ధాన్యం సుఖదుఃఖాల కీర్తన
నారు గుండెల మెరుపు నాఊరు
వెనక్కూముందుకూ సాగే అడుగు
లోకం ఇరుసు ప్రపంచీకరణ జాడ
పట్నంలో విలవిల ఊరు సిగపూవు
వీడిన ఆకుపచ్చ బాటల ఊరు
నీడలేని చెట్టు ఉనికి బతుకని గాలిఅల
నడవని బాల్యం కురువని వాన జల్లు
పాలగోకు కమ్మదనం కానరాని ఊరు
చిరునామా పెకిళించబడ్డ వేరు అమ్మ
అందాల పూలతోట విరిగిన కొమ్మల చెట్టు
అనూహ్య పాలన ఖాళీ ఘటం
శాంతిసహజీవనాల ఊరు కుంపటి రాజకీయం
నమ్మకాలు విలువలన్నీ విగత జీవులు
మనిషి నేపథ్యమే పారే నది
తీపిగుర్తుల ప్రకృతి కల గజిబిజి ఆగమాగం
ఊహల ఆశలన్నీ మమతల్లేని శూన్యం
************************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి