హన్మకొండ వెళితే
అమ్మమ్మ ఇంట్లో
ఆనందంగా -
ఆడుకుంటాడు ...!
విశాలమైన హాల్లో
స్వేచ్ఛగా-
పరుగులు తీస్తాడు !
అక్కకున్న -
ఆటబొమ్మలతో...
అదేపనిగా వంటరిగా-
ఆడతాడు....!
స్కూటరు బండి (బొమ్మ )
ఎక్కి, హై స్పీడులో -
నడుపుతాడు....
అసలే భయపడడు,
హీరో లా,
తలపైకెత్తి నవ్వుతాడు!
బయటకు వెళ్ళే-
హాడావిడిలో...
ఏమిచేయమంటే-
అదిచేస్తాడు....!
కొత్తబట్టలు వేస్తే-
తెగ మురిసిపోతాడు,
మనవడు నివిన్ బాబు!!
***
హీరో ..నివిన్ ..!!----డా. కె.ఎల్.వి.ప్రసాద్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి