సుప్రభాత కవిత : -బృంద
అలవాటుగ  సాగే పయనంలో 
అనుకోని మలుపులెన్నో 
ఆదమరచి అడుగువేస్తే 
అనుభవమయేది అనర్థమే!

ఆలోచన మంచిదైతే 
ఆచరణగ మార్చుకుంటే 
అనువుగాని చోట అయినా 
అవలీలగా  గెలిచేయొచ్చు!

నడిచే కొద్దీ దారి 
గడిచే కొద్దీ మారి 
తలచే తీరం చేరి 
కలలే కమ్మగ తీరు!

సహనం నీ సొంతమైతే 
సమయం నీ చెంతకొచ్చు 
గమ్యం నీకు స్పష్టమైతే 
గమనం ఎంతో ఇష్టమౌను!

పూలదారి పరచదు కాలం 
పూలు ఏరి  అమర్చుకుంటూ 
మేలు దారి చేసుకుంటూ 
వీలుగా త్రోవను మార్చుకుంటూ

సాగిపోయే బాటసారికి 
ఆగి చూచే అవసరమేముంది?
వీడిపోగా కలతలన్నీ 
తోడుగా  వచ్చే వేకువకు 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు