సుప్రభాత కవిత ; - బృంద
గడచిన గతంలో 
నలిగిన క్షణాలెన్నో 
నడచిన త్రోవలో 
తగిలిన దెబ్బలెన్నో..!

ప్రతి దినం పోరాటం 
అనుక్షణం ఆరాటం 
ఆలోచన తోచని 
అసహాయమైన అక్రోశాలెన్నో!

అలజడి కలిగిన సమయంలో 
ఆదుకున్న ఆప్తులెందరో 
అనుకోక దొరికి దగ్గరైన 
అపురూప అనుబంధాలెన్నో!

చిన్నిచిన్ని సంతోషాలతో 
నింపుకున్న మనసులో
వంపుకున్న కొద్దీ ఊరే 
మకరందపు ఊటలెన్నో!

విరిసిన పువ్వుల తోటలో 
కురిసిన నవ్వుల వానలో 
తడిసి రాలిన రెక్కలెన్నో 
వసివాడిన  మొగ్గలెన్నో!

కొత్త వెలుగుల కాంతిలో 
మెత్తగా  సాగె అడుగులో 
వచ్చే మలుపుల మెలికలు 
తెచ్చే ముచ్చట్ల పొట్లానికి 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు