తగ్గని పొరుషం:- డా.చీదెళ్ళ సీతాలక్ష్మి-తిరుమల కాలనీ,హైదరాబాద్
పురుషుల దినోత్సవం సందర్బంగా
-----------------------------------------
వారికి కావాలా ఓ దినం
ఏంటమ్మా అంత బాధ
సర్వకాల సర్వావస్థల్లో
తగ్గని పౌరుషం
కొడుకును కన్న తల్లికి
మగాడైన తండ్రికి!!

మగ పుట్టుకైతే చాలు
లోకాన్ని గెలిచినంత ఆనందం
ఎట్లా ఉన్న ఫరవాలేదు
తెలివి తక్కువైనా తగ్గేది లేదు
వాడు మగాడు
వాడు మొగడు!!

మింగుడుపడని మగడు
నింగిలో సగమని భ్రమించిన స్త్రీ
పెనులా కుక్కేవారు
నల్లిలా నలిపేవారు
మనమధ్యనే ఉన్న మగాళ్లు
కాదు మృగాళ్లు!!

అయినా ఎక్కడో
ఎవరో ఒకరిద్దరు
పురుషపుంగవులు
మనిషిలా మెరిసే వారు
మురిపిస్తూ లాలించే వారు!!

వీళ్ల చాకిరి కోసమే ఆడది ఈడదిగా సంసారం ఈదుతూ
ఎప్పుడు మారునో సమాజం
బ్రూణ హత్యలు
అఘాయిత్యాలు తగ్గేదెప్పుడో!!

కన్నది తల్లే అయినా
కన్నకలలు నెరవేరని కన్నెలు
ఇంకా తగ్గని పురుషాహంకారం
వీడని పౌరుషం
ఆకాశమంటుకొని 
సప్తసముద్రాలు దాటినా
గీయని రేఖను దాటని వైనం
ఇది పచ్చి నిజం!!


పుట్టిన బిడ్డ చూసి
మట్టు పెట్టే కాలం
మత్తు దిగాలి
అహం తొలగాలి

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
చాలా బాగుంఫై..చేతిలో సెల్ ప్రపంచాన్ని చుట్టేసే జ్ఞానం అయినా ఉచ్చులో పడి కొట్టుకుంటుంది కొందరు యువతులు.పాపం మగవాళ్ళు కూడా కొందరు ఆడవారి ఉచ్చులో పడి నలిగిన వైనం.
అజ్ఞాత చెప్పారు…
ఎవరి దృష్టి వారిది