మరుమల్లె; -గుండ్లపల్లి రాజేంరప్రసాద్, భాగ్యనగరం
చూపుతుంది
తెల్లగా
శుద్ధిగా
రంగును

చల్లుతుంది
మెల్లగా
మత్తులా
సుగంధాన్ని

చాటుతుంది
చల్లగా
ప్రేయసిలా
ప్రేమనురాగాలని

చూపుతుంది
సొబగులు
కోమలాంగుల
కొప్పులెక్కి

భక్తినిచాటుతుంది
పూజావస్తువై
దేవతలమెడలనలంకరించి
పాదాలచెంతకుచేరి

అంజలిఘటిస్తుంది
రెబ్బలై
తలలపై
చల్లబడి

ఆహ్వానిస్తుంది
గుచ్ఛమై
కట్టబడి
చేతులకివ్వబడి

దోస్తుంది
చిత్తాలను
పిండబడి
అత్తరై

మల్లె
నాచెలికత్తె
నాప్రోత్సాహిత
నాప్రియకవిత


కామెంట్‌లు