పేరు పెట్టి పిలిస్తే
దేవుడు పలుకుతాడో లేదో
కానీ
పేరు పెట్టి పిలిస్తే
మనిషి మాత్రం తప్పకుండా పలుకుతాడు.!?
ఈ ప్రపంచంలో మనకెంతో ఇష్టమైన వారు
అమ్మానాన్న
కానీ అంతకంటే ఇష్టమైనది
మనం -మన -పేరు!!
ఈ ప్రపంచంలో మనకెంతో ఇష్టమైన వారు
అక్క- చెల్లి -తమ్ముడు -అన్న
కానీ అంతకంటే ఇష్టమైనది
మనం -మన -పేరు!!!
ఈ ప్రపంచంలో మనకెంతో ఇష్టమైన వారు
స్నేహితులు -బంధువులు
కానీ అంతకంటే ఇష్టమైనది
మనం మన పేరు!!!
ఈ ప్రపంచంలో మనకెంతో ఇష్టమైన వారు
ప్రేయసి -భార్యాపిల్లలు
కానీ మనకెంతో ఇష్టమైనది
మనం -మన -పేరు!!!!
ఈ భూమిపై పుట్టిన అద్భుతాలు
శరీరం -పేరు -ప్రేమ !!!
శరీరం శాశ్వతం కాకపోవచ్చు!
కానీ పేరు- ప్రేమ -శాశ్వతం కావచ్చు!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి