న్యాయాలు-657
యూకాభియా కంథనాశ్రయణ న్యాయము
******
యూకా అనగా పేను, నల్లి.అభియా అనగా వచ్చుట, ఆక్రమించుట,యుద్ధమునకై బయలు దేరుట.కంథా అనగా బొంత ,ఆశ్రయణ అనగా అండ, ఆశ్రయం అనే అర్థాలు ఉన్నాయి.
"బొంతను ఆశ్రయించి ఉన్న నల్లులు కుడతాయని బొంతపై పడుకోవడమే మానేసినట్లు" అని అర్థము.
ఇదొక సరదా న్యాయముగా చెప్పుకోవచ్చు. ఎవరో ఓ ఒళ్ళు వంగని వ్యక్తి పడుకోవడానికి వేసుకునే బొంతలో నల్లులు ఉన్నాయని చెప్పి ,బొంత వేసుకోవడమే మానేశాడట.కొంచెం శ్రమ పడితే బొంతను ఆశ్రయించిన నల్లులను వదిలించుకోవచ్చు కదా! ముఖ్యంగా ఒంట్లో చేరిన బద్ధకం, సోమరితనం వల్ల ఆపని చేయడమే మానేశాడు.
సోమరితనం వదిలించుకోవడము అంత తేలికైన పని కాదు. ఒక్కసారి ఒంట్లోకి ప్రవేశించిన తర్వాత బద్ధకం ఎక్కువై ఏం పని చేయనీయదు.
ఇంతకు ముందు చెప్పుకున్నట్లు భిక్షగాడు వస్తడేమోనని వంట చేయడం మానేసినట్లు, ఈ వ్యక్తి ఇలా...
బొంత అనగానే ఎవరికైనా చిన్నప్పటి జ్ఞాపకాలు ముప్పిరిగొంటాయి. ఎందుకంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో బొంత లేని ఇల్లు ఉండేది కాదు. మెత్తగా అమ్మ ఒడంత వెచ్చగా ఉండేది. అందులోనూ ఆ బొంతలు అమ్మ అమ్మమ్మ, బామ్మ లో చీరలతోనే తయారు చేసేవారు.
వాయిలు చీరలు,నూలు చీరలు కొంత కాలం అయిన తరువాత ఎక్కడో కొంచెం చిరుగు పట్టగానే తీసి పక్కన పెట్టే వారు. అలా పెట్టిన వాటిని ఒకదానిపై పెట్టి చక్కగా బొంతలా కుట్టే దొనిని కప్పకోవడానికి, పరుపుగా కింద కానీ,మంచం మీద కానీ వేసుకోవడానికి ఉపయోగపడేది.
ఒకప్పుడు నల్లుల బెడద ఎక్కువగా ఉండేది.మనుషుల రక్తాన్ని పీల్చుకుని జీవించేవి. వాటి ని చూడాలంటే కనిపించేవి కావు. మంచి నిద్రలో ఉన్నప్పుడు చటుక్కున కుట్టేవి.అలాంటి మంచాలను ఇంటి ముందు వేసి బాగా నీళ్ళు కాగబెట్టి పోసి చంపేవారు.ఈరోజుల్లో అలాంటి కష్టం ఏమీ లేదు.
ఇక్కడ ఒచ్చిన చిక్కల్లా సోమరితనం,బద్దకమే కాబట్టి వాటిని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది అనే ఉద్దేశంతో మన పెద్దవాళ్ళు ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
దీనికి దగ్గరగా ఉన్న మరో రెండు ఉదాహరణలు చెప్పుకుందాం. ఇంట్లో ఎలుకలు ఉన్నాయని పోవడానికి ఎలుకల బోను పెట్టకుండా ఇంటికే నిప్పు అంటించాడట. అలాగే ఒకసారి రాజు గారు బద్ధకస్తులందరినీ పిలిచించి ఎంత మంది ఉన్నారో లెక్కిద్దాం చేతులెత్తండి అంటే ఒకతను అలాగే కూర్చుని ఉన్నాడట. ఎందుకు చేయి ఎత్తలేదంటే ఎత్తడానికి బద్దకం వేసి ఎత్తలేదని చెప్పాడట. ఇలాంటి కథలన్నీ ఈ"యూకభియా కంథనాశ్రయ న్యాయానికి చక్కగ సరిపోతాయి కదండీ!. అలాంటి భద్దకం జోలికి మనం మాత్రం పోవద్దు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి