యుటిఎఫ్ రాష్ట్ర, జిల్లాశాఖల్లో కొత్తూరు నేతలకు స్థానం

 మందస-హరిపురంలో ఇటీవల జరిగిన   యుటీఏఫ్ ఏబదివసంతాల స్వర్ణోత్సవ మహాసభల్లో నూతన కార్యవర్గాల ఎంపిక జరుగగా, అందులో కొత్తూరుకు చెందిన సీనియర్ నాయకులు చోటు దక్కించుకున్నారు. దండు ప్రకాశరావును రాష్ట్ర కౌన్సిలర్ గా, బోడ శ్రీనును జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఉపాద్యాయుల సమస్యలు పరిష్కారానికి నిరంతరం కృషిచేస్తున్న వీరిని సంఘం గుర్తించిందని కొత్తూరు మండలం అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కె.విజయకుమార్, మధుసూదన రావులు హర్షం వ్యక్తం చేసారు, కొత్తూరు మండలానికి జిల్లా, రాష్ట్ర సంఘం గుర్తింపు నివ్వడాన్ని మండలం కార్యవర్గ సభ్యులంతా హార్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు