సాంఘిక శాస్త్ర క్విజ్ లో కడుము బాలల ప్రతిభ

 నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం, సాంఘిక శాస్త్ర దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని కొత్తూరు మండలస్థాయిలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు తృతీయ స్థానాన్ని సాధించారని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు తెలిపారు. మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ సాంఘికశాస్త్ర టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో, సాంఘిక శాస్త్రం విషయ అంశాలపై నిర్వహించిన క్విజ్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు వలురోతు లక్ష్మి, బూరాడ రోజా, బూరాడ జోహన, గేదెల వినయ్ కుమార్ ల బృందం తృతీయ స్థానాన్ని సాధించి, బహుమతితో పాటు నగదు పారితోషికాన్ని స్వీకరించారని ఆయన తెలిపారు. సాంఘిక శాస్త్రోపాధ్యాయులు బండారు గాయత్రి, గుంటు చంద్రంలు విద్యార్థులకు తర్ఫీదునిచ్చిరి. విద్యార్థులను 
ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, యందవ నరేంద్రకుమార్, రబికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణలు ప్రశంసించారు.
కామెంట్‌లు