రాజేశ్ చాలా దిగులుగా ఉన్నాడు. అన్నం సరిగా తినడం లేదు. ఇంట్లో ఎవరితో మాట్లాడటం లేదు. రెండు రోజుల నుంచి ఇంతే. చెల్లెలు శ్రీలక్ష్మి కారణం అడిగింది. "ఇండియన్ క్రికెట్ టీం స్వదేశంలోనే న్యూజీలాండ్ చేతిలో మూడు టెస్ట్ మ్యాచులూ ఓడింది." అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. *ఓరి అన్నయ్యా! నీకు క్రికెట్ పిచ్చి శ్రుతి మించుతుంది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక పుస్తకాల సంచి ఇంటివద్ద పడేసి, బయటకు వెళ్లి, గంటల తరబడి క్రికెట్ ఆటే. ఆదివారం వస్తే ఇంటి పట్టున అసలే ఉండవు. ఇలా అయితే చదువు ఏమవుతుంది?" అన్నది శ్రీలక్ష్మి. కోపంతో చెల్లెలిని కొట్టబోయాడు రాజేశ్.
విద్యార్థుల వరీక్షా పేపర్లు ఇంటికి ఇచ్చారు, రాజేశుకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి. రాజేశ్ తల్లి చాలా దిగులుతో ఉంది. వరుసగా మూడు రోజులు అన్నం ముట్టలేదు. ఏడుస్తూ కూర్చుంది. రాజేశుతో మాట్లాడటం మానేసింది. రాజేశ్ చెల్లెలు వద్దకు చేరి, బాధ పడుతున్నాడు.
అప్పుడు శ్రీలక్ష్మి "చూడు అన్నయ్యా! బాగా చదివితేనే మంచి భవిష్యత్.ఉంటుంది. అమ్మా నాన్నలు మనల్ని ఉన్నత స్థాయికి తేవాలని అహర్నిశలూ కష్ట పడుతారు. క్రికెట్టులో ఆటగాళ్లు ఓడిపోయినా వాళ్లకు డబ్బులు వస్తాయి. మరునాడే ఓటమిని మరచి పోయి హాపీగా ఉంటారు. వాళ్లకు కాసులు కురిపించు ఆటలు ఉన్నాయి. నీ భవిష్యత్ గురించి వాళ్లు ఆలోచిస్తున్నారా? మరి నీకు ఎందుకు దిగులు?అమ్మ గురించి ఆలోచించు" అన్నది శ్రీలక్ష్మి. ఆలోచిస్తున్నాడు రాజేశ్.
మరునాడు పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన రాజేశ్ కొద్ది సేపు విశ్రాంతి తీసుకుని చెల్లెలితో కలసి హోం వర్క్ మొదలు పెట్టాడు. ఇంతలో రాజేశ్ మిత్రుడు వినోద్ అక్కడకు వచ్చి "ఏరా రాజేశ్'! ఇవ్వాల క్రికెట్ ఆడటానికి రాలేదు ఏందిరా?" అన్నాడు. "సారీరా! నీ సహవాసం పడితే ఫెద్దయిన తర్వాత అడుక్కు తిని బతకాల్సి వస్తుంది. లేదా చెడు అలవాట్లతో భవిష్యత్ అంధకారం అవుతుంది. సమయం విలువ తెలుసుకున్నా. బై." అన్నాడు రాజేశ్. వినోద్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
.
సమయం విలువ :- సరికొండ శ్రీనివాసరాజు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి