బడి గోడ :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 మాబడి గోడ
ఎంతో అందమైంది
మా బడి గోడ హృదయం 
ఎంతో విశాలమైంది 
మాబడి గోడ
అందరినీ ఆదరిస్తుంది
మా బడిగోడ
ఎవరినీ నొప్పించదు
మా బడిగోడ
మమ్మల్ని పిలుస్తుంది
మమల్ని మురిపిస్తుంది
మాకు పాఠాలు చెబుతుంది
మాకు నెమ్మదిగా విద్య గరుపుతుంది 
ఎంత ఓర్పో మా బడి గోడకు
దినమంతా నిలుచునే ఉంటుంది 
మలిసంధ్య దాకైనా నేరిపిస్తుంది
మమ్మల్ని ఒక్క మాటైనా అనదు సుమీ!
పైగా…..,
తన గుండెను నల్లబల్లగా మలిచి 
మాకు అక్షరాలూ, గుణింతమూ
పదాలు, పాఠాలు పాఠాలుగా కూర్చి
చదివిస్తుంది
భాషలే కాదు
అన్ని శాస్త్రాలూ అవలీలగా చదివిస్తుంది
పదములు కూడా పాడిస్తుంది
ఔనూ…!
ఇంత అనుభవ జ్ఞానం
ఎలా వచ్చిందబ్బా తనకు?
నిత్యం
గురు దర్శనం వల్లనే కదూ?!...
**************************************

కామెంట్‌లు
బడి గోడ.... చాలా బాగా చెప్పారు సర్... super.
Ramakrishna Patnaik చెప్పారు…
చదువుల ఒడి బడిని గూర్చి మీ నుడిలో చక్కగా కవిత్వీకరించారు గురూజీ!