కవి సోమన్నకు కర్నూలు గ్రంథాలయంలో సన్మానం

 పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు  గద్వాల సోమన్నను గ్రంథాలయ వారోత్సవాలు మరియు కవి సమ్మేళనం సందర్భంగా విచ్చేసిన కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ ఇంచార్జి ఉపకులపతి శ్రీ డా.యన్.టి.కె.నాయక్,తెలుగు భాష వికాస ఉద్యమం అధ్యక్షులు శ్రీ జె.యస్.ఆర్.కె.శర్మ ,కార్యదర్శి శ్రీ కె.ప్రకాష్ ,గ్రంథాలయ అధికారిణి శ్రీమతి వి.పెద్దక్క మొదలగు వారు కర్నూలు గ్రంథాలయంలో  ఘనంగా సన్మానించారు.అనంతరం వీరు రచించిన  "చిరు మువ్వలు"పుస్తకాన్ని కవులు,పాఠకులు,పాత్రికేయ మిత్రుల సమక్షంలో  పరిచయం చేయడం జరిగింది. అదేకాకుండా సోమన్న రచించిన యావై పుస్తకాలు గ్రంథాలయానికి ఉచితంగా అందజేశారు. అనతి కాల వ్యవధిలో 58పుస్తకాలు వ్రాసి ముద్రించిన శ్రీ గద్వాల సోమన్న గారి విశేష కృషిని ప్రశంసించి,సత్కరించటం విశేషం.ఈ కార్యక్రమంలో కవులు  సుబ్బలక్ష్మమ్మ,ఇనాయతుల్లా,అవుల బసప్ప,స్వరూప సిన్హా మరియు జహీర్ మున్నగువారు పాల్గొన్నారు.
కామెంట్‌లు