అలుముకున్న చీకట్లు
కరిగిపోయేనా?
చుట్టుకున్న ఇక్కట్లు
తొలగిపోయేనా?
కఠినమైన తరుణాన
కనుల నీరు పొంగితే
తుడిచిపోగా మబ్బులన్నీ
కురవాలని వేచేనా?
అరుణ వర్ణపు కిరణమైనా
అగ్గి నిప్పుగ తోచేనా?
కరుణ కురిసే కాంతులన్నీ
పొగలు సెగలు గక్కేనా?
నేరమేమి చేయకనే
ఘోర శిక్షలు అనుభవించే
జన్మలకు జగతిలోన
కర్మ అన్న దొకటే కారణమా?
కాటువేయు కాలానికి
కారుణ్యముండునా?
వేటు మీద వేటు వేయు
వేడ్కలేమో వేలుపులకు?
బరువెక్కిన బ్రతుకులకు
తూరుపు పిలుపు వినిపించునా?
మూగబోయిన మనసులకు
ఉదయరాగం తెలియునా?
పెంచుకున్న మమతలు
పంచుతున్న హృదయాలలో
కొత్తకాంతులు పూయించే
కాంతిపుంజం కనిపించాలని
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి