కలలు కనుముందు కదిలిన
కమ్మనైన తలపులా...
కలత తొలగిన కనుల నిండిన
కళలు కురిసే నవ్వులా
వెలుగు కొరకు వేసారి
అలసి సొలసిన మనసు
తలచే గోరంత దీపమేదో
కనులవిందుగా కనిపించిన క్షణంలా
కునుకు పట్టని నిశిరాతిరి
మగత నిదుర లోన చూసిన
మనసైన మధుర స్వప్నం
గురుతు వచ్చిన మనసులా
కఠినమైన ప్రసవ వేదన
మరచిపోయి మమత నిండి
చేతికొచ్చిన బ్రతుకు పంటను
చూసుకున్న తల్లి మనసులా
పసిడిరంగులు పొంగి పొర్లి
మిసిమి వన్నెల నింగి పొంగి
వసుధనంతా కొత్త వెలుగు
నింపి చూసి మురిసే సంబరంలా
ప్రశ్నకు జవాబులా
సమస్యకు పరిష్కారంలా
నిరీక్షణకు ఫలితంలా
ఆశకు ఆధారంలా వచ్చిన వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి