డిమాండు ...!!: ---డా.కె .ఎల్ .వి.ప్రసాద్ .

 పిల్లలను 
మరిపించడానికి 
మురిపించడానికి 
తమపనులుచేసుకోడానికి 
వీలుగా .....
మొబైల్ నో ....
టి.వి.నో ....
అలవాటుచేస్తారు ....
తల్లిదండ్రులు ......!
ఆ ..అలవాటు ....
ముచ్చటగాముదిరి 
శిఖరాగ్రం చేరుతుంది 
టి.వి ,పెడితేనే 
తింటామనే పరిస్తితి వస్తుంది !
కొట్టినా -తిట్టినా ....
ఉపయోగంలేనిపని 
పిల్లలడిమాండుకు 
తలవంచకతప్పదు 
టి.వి ..ఆన్ చేయకతప్పదు !
మనవడు ' నికో '....
దీనికిఅతీతం కానేకాదు 
ఒకఏడుపుతో -
వాడు ఏదైనా సాధించగలడు !!
                 ***
కామెంట్‌లు