శ్లో:! నిత్యాయ త్రిగుణాత్మనే పులజితే కాత్యాయనీ శ్రేయస్సే
సత్యా యాది కుటుంబినీ ముని మనః ప్రత్యక్ష
చిన్మూర్తయే
మాయా సృష్టి జగత్రయాయ సకలామ్నాయాంత సంచారిణే
సాయం తాండవసంభమాయ జటినే సేయం
నతిశ్శంభవే !
భావం! శాశ్వతుడును త్రిమూర్తి స్వరూపుడునూ త్రిపురాసురులను సంహరించిన వాడునూ, కాత్యాయినీ మనోహరుడునూ, సత్యమైన వాడునూ, మునుల మనం యలకు ప్రత్యక్షముగా
గోచరమైన చిత్ స్వరూపుడును, మాయ వలన ముల్లోకములను కల్పించువాడును, వేదాంత వేద్యుడును, సంధ్యా కాలమున తాండవము చేయుటకు ఇష్టపడువాడును జటా జూటము కలవాడును, మొట్టమొదటి సంసారి యు అయినా శివునికి నమస్కారము.
******
శివానందలహరి:- కొప్పరపు తాయారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి