న్యాయాలు-672
లూతాతంతు న్యాయము
*****
లూతా అంటే సాలెపురుగు, ఈగపులి,జాలకాడు,తంతునాభం,నేతపురుగు,బెలశం,లాలవిషం,శలకం,సన్నసిల్లి, సాలీడు.ఉర్ణనాభము అనే అనేక అర్థాలు ఉన్నాయి.ఇక లూతాతంతు అంటే సాలెగూడు అని అర్థము.
సాలెపురుగు తన నోటి నుండి తానే దారమును పుట్టిస్తుంది.ఆ దారంతో ఎంతో నైపుణ్యంతో గూడు కట్టుకుంటుంది.దానిని అలాగే ఉండనీయకుండా మరల ఆ దారమును తన పొట్టలో నింపుకుంటుంది అంటే మింగేస్తుంది.ఈ క్రియను చేసినప్పుడు లేదా చేసేటప్పుడు ఎలాంటి ఉద్వేగాలకు,వికారాలకు లోను కాకుండా నిర్వికారంగా చేస్తుంది.
అది సాలెపురుగు సహజ లక్షణం కావొచ్చు.కానీ దీనినే భక్తులు,తత్వవేత్తలు ఆధ్యాత్మిక, తాత్విక దృష్టితో చూస్తుంటారు.
అన్నింటికీ అతీతమైన శక్తి స్వరూపంలో పరమాత్ముడు ఉంటాడనీ ,ఆ పరమాత్మే తన స్వేచ్చాయుత ఆలోచనలతో ప్రపంచాలను తనంత తానుగా సృజించి, తనంత తానుగా తనలో లీనం చేసుకుంటాడని నమ్ముతారు.
సహజ కవి పోతన తాను రాసిన గజేంద్ర మోక్షములో గజరాజు నోటి నుండి ఇదే అర్థం వచ్చేలా పలికించిన అద్భుతమైన పద్యాన్ని చూద్దామా...!
"ఎవ్వనిచే జనించు జగ మెవ్వని లోపల నుండు లీనమై/యవ్వనియందు డిందు బరమేశ్వరుడెవ్వడు, మూలకారణం/బెవ్వ,డనాది మధ్యములయు డెవ్వడు సర్వము దానయైన వా/ డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్"
ఈ పద్యానికి అర్థము "ఎవరిచేత ఈ జగమంతా సృష్టించబడినదో,ఎవరిలో ఈ జగమంతా లీనమై వుందో,ఎవరి చేత ఈ జగము నాశనము చేయబడుతుందో,ఈ సృష్టికి మూల కారణం ఎవరో, మొదలు,చివర,మధ్య అంతా తానే అయి వున్నవాడు ఎవరో అంటే అన్నింటికీ మూలమైన ఆ ఈశ్వరుణ్ణి శరణు కోరుచున్నానని" గజరాజు అంటాడు.
డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కూడా ఈ పద్యంపై వ్యాఖ్యానిస్తూ సర్వేశ్వరుని మూలతత్వం ఇందులో ఇమిడి ఉందని అన్నారు.
ఇందులో ఎవ్వడు అంటే అవ్యక్తుడనీ,ఆ అవ్యక్తమైన రూపం గలవాడిని గురించి చెప్పడానికి ఉపయోగించిన 'ఎవ్వడు' అనే పదము ఎన్నో విభక్తులతో రూపుదిద్దుకుందనీ, ఇదే ఈ పద్యంలోని ప్రత్యేకత,విశిష్టత అంటారు.
ఉపనిషత్తులలోని ముండకోపనిషత్తు కూడా ఇదే విషయాన్ని చెబుతూ "సాలెపురుగు నుండి దారం ఎలా వస్తుందో, మళ్ళీ ఆ దారం దాని లోపలికి ఎలా వెళ్ళిపోతోందో ...ఈ క్రియ అత్యంత సహజంగా నిర్వికారంగా ఎలా జరుగుతుందో అలాగే బ్రహ్మ యొక్క సృష్టి కూడా..సృష్టించడం లయింప జేయడం కూడా బ్రహ్మ ఇష్ట ప్రకారం జరుగుతుందని చెబుతుంది.
మరి దీనిని మానవులుగా మనకు అన్వయించుకుంటే మన మనసు అనేకమైన ఆలోచనలు సృష్టించుకుంటుంది.వాటిని క్రియారూపంలో చూడాలనుకుంటే కష్టపడి దానికి వాస్తవ రూపం కల్పిస్తుంది.వద్దనుకుంటే విరమించుకుంటుంది.అంటే ఇక్కడ మనసును బ్రహ్మ గానో, సాలెపురుగు గానో భావించుకోవచ్చన్న మాట.
ఇదే "లూతాతంతు న్యాయము"లోని నిగూఢమైన అర్థము.దీనిని అవగాహన చేసుకొని మనమేమిటో,ఏం చేయాలో గ్రహిద్దాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి