హాయి:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 కిటికీ తెరిచాను
ఒక్కసారిగా
వెన్నెల ఝల్లు
నన్ను తడిపేస్తూ
గది నిండిపోయింది
కింటికీ పక్కనే
నక్కిన జాజితీగ 
అప్పటికే
బోలెడు పూలతో
విర్రవీగింది
దాంతో 
పూల పరిమళం
గదిలోకి తోసుకొచ్చింది
ఆకాశంలో
మల్లెమొగ్గల్లాంటి
చుక్కల మధ్య చంద్రుడు
గదిలో
పూల పరిమళంతో
కలిసిన వెన్నెల్లో
నేను
ఎవరు హాయిగా ఉన్నారు
చంద్రుడా?!
నేనా?!
**************************************


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
భావ సముద్రం లో తేలి ఆడుతున్న కవి మాత్రమే మరియు రసిక హ్రుదయం గల శ్రోత మాత్రమే......
Ramakrishna Patnaik చెప్పారు…
అవునవును!ఆ రేరాజు కన్నా మా గౌరవరాజు కవితల వెన్నెల పరిమళాలే మిన్న!