డబ్బు:- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 డబ్బు 
మనిషికి
ఎలాంటి కష్టాల నుంచైనా 
ఎలాంటి ఇబ్బందుల నుంచైనా
రక్షించే కవచం! 
ప్రపంచాన్ని పాదాక్రాంతం 
చేసుకునే శక్తిశాలి!
సంఘంలో సకల సౌకర్యాలను
గౌరవాలను అందించేది!
ఒంట్లో బాధలన్నింటిని
మరిపింపజేసి
హాయిగా నిద్రపుచ్చే
అద్భుతమైన ట్రాంక్విలైజర్!
అయితే….
డబ్బుని ప్రేమించడం, గౌరవించడం 
నేర్చుకున్నప్పుడే
అది మన దగ్గర నిలుస్తుంది! 
డబ్బుని నిర్లక్ష్యం
చేసేవాళ్ళ దగ్గరనుండి
చెప్పాపెట్టకుండానే వెళ్ళిపోతుంది
పైగా…,
కష్టాలను, నష్టాలను, రోగాలను
శతృత్వాన్నీ,దుఃఖాన్నీ,అగౌరవాన్నీ
నెత్తిన రుద్ది మరీ
జారుకుంటుంది!!
**************************************


కామెంట్‌లు
Ramakrishna Patnaik చెప్పారు…
డబ్బు మనిషిని నిద్ర పుచ్చే ఔషధనీయ ట్రాంక్వలైజర్ తో పోల్చడం గొప్పది!