*నింగికెగసిన అద్భుతతార *:-- కోరాడ నరసింహా రావు!
  నింగి కెగసిన అద్భుత తారకు
 ద్వితీయ స్మృత్యంజలి💐🙏🌷
         సినీ వినీ లాకాసంలో.... 
 ఉద్దండులైన ఇద్దరు రాజ్య మేలు తున్న రోజులలో... 
   రొటీన్ తో కాస్త విసుగు చెం దుతున్న తరుణ0 లో... 
  సాధారణ రంగ ప్రవేశముచేసి
  అసాదారణ ప్రజ్ఞను కనపర చిన అద్భుత శక్తివి నీవు.! 
నీవు నిజము గనేనీ వు .... డేరింగ్ & డేషింగ్ వే...! ఆ ప్రశ0సా  అక్షర సత్యమే...! 
చూసినదే చూ స్తు  బోర్ కొడు తున్న కాలమది..., 
  ఇటు ప్రేక్ష కుల లోనూ .... 
 అటు పరి శ్రమ లోనూ... 
జోష్ ని నింపుతు... కౌబోయ్, డిటెక్టివ్ చిత్రా లను పరిచయం చేసిన ఘనత నీదే..... 
వెండి తెర పై నలుపు- తెలుపె తెలిసిన ప్రేక్షకులను, తెరను సప్త వర్ణములతో నింపి ప్రేక్ష కులను అలరించినసూరుడవు
నీవే....
      చిన్నతెరను పెద్దది చేసి
అబ్బో-ఆ హా అనిపించావు! 
నీ ధైర్యమే  ధైర్యము...! 
   నీ తెగింపే తెగింపు...!! 
 ప్రయోగాలకు పుట్టి నిల్లు నీ మెదడు...! 
    బ్రతికినన్నాళ్లు సాహసమే ఊపిరిగా బ్రతికావు...! 
   ముందే ఎంతో పేరున్న దేవ దాసుకు పోటీగా నీవూ మరో దేవదాసు తీసి ఎవ రే మను కుంటే నాకేంటి అనుకునే ... 
డేరింగ్ & డేషింగ్ హీరోవి సినీ ప్రపంచంలో  నువ్వొ క్కడివే ! 
 నీకు సాటిమరొకరు లేరు...! 
 
నీ అల్లూరి సీతారామరాజు ప్రేక్ష కులలో, సమర యోధుడు
 సీత రామ రాజుకే మరింత గుర్తింపును, గౌరవాన్నీ తెచ్చి పెట్టిందనుట అతి శయోక్తి కాదు...! 
    విజయ నిర్మలను చేపట్టి, సముచిత స్థానమిచ్చి ఆమెను దర్శకు రాలిని చేసి గొప్పగుర్తి0 పును , గౌరవాన్ని కలిగించావు
ఎన్నో విజయ వంత మైన సినిమాలను తీసి ప్రేక్షకులను ఆలరించటమే గాక ముగ్గురు వారసులను వెండి తెరకు అందించిన ఘనత నీది , 
   నీ యంతటి ఘనుడు నీ మహేశ్...! 
    తండ్రి పేరు నిలబెట్టిన తనయుడు....! 
  నీవు దేహ త్యాగము చేసినా
   నీ సినిమాలు ఎల్లకాలమూ 
 సజీవ సాక్ష్యములై కల కాలం
 నిలిచే ఉంటాయి... 
    జయహో సూపర్ స్టార్...! 
    విజయహో... కృష్ణ....!! 
      ******

కామెంట్‌లు