మంచు మూసిన దుప్పటిలో
మగత నిదుర పోయే లోకానికి
మసక వెలుగుల మాటున వచ్చే
మెరుపుల వెలుగు తెలియదా!
మంచితనపు ముసుగులో
వంచనలెన్నో జరిగేనని
కొంచెం కూడా కరుణ లేని
కంచెలే చేను మేసేనని...
మాటలోని తీయదనం
మనసులో ఉండదని
నవ్వులో మెరుపులన్నీ
అసలుగాక నకిలీలని....
చెప్పుటే కానీ చేతలుండవని
మెప్పులే కానీ ఒప్పులుండవని
తప్పులే కానీ తప్పనిసరి అని
గొప్పలన్నీ చెప్పలేని మాయలేనని..
కుప్పలు గా చేరిన తప్పులకు
తప్పకుండ శిక్ష ఉండునని
ఎప్పటికైనా కాలం కొరడా దెబ్బల
ముప్పు తప్పించుకోలేరని. చెబుతూ
కొత్త వెలుగుల వేడితో
చెత్తను దహించివేసి
మెత్తగా ఒకవైపు నుండీ
మొత్తం మార్పులు తెచ్చే
వెచ్చని ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి