నేటి సమాజం....! :- కోరాడ నరసింహా రావు
కుళ్ళు,కుతంత్రం-మాయ,మోసం
  ప్రబలి పోతున్న సమాజం
 ఇది కలి స్వైర విహారం
   విచ్చిన్న వినాశకం..! 

మానవత్వవం మాయం
 దానవత్వ విజృంభణ0
హత్యలు-మా న భంగాలు
 ఇది అరాచక సమాజం..! 

యదార్ధ వాదం... 
  లోక విరోధం... 
 మౌ న మే  శరణ్యం
 ఇదే కదా ఉత్తమం...! 

ఛిద్ర మై పోతున్నాయి
 బంధాలు - అనుబందాలు
 ఎవరిదారి వారిదే... 
 ఇది ధన ప్రభావం...! 

చేత గాని మంచి తనం... 
  అలు సైన జీవితం... 
   అగ చాట్ల ప్రయానం... 
  ఇంకెక్కడి సుఖగమ్యం ! 
  ******

కామెంట్‌లు