సుప్రభాత కవిత :- బృంద
మంచు మూసిన  గగనాన
పొంచి ఉన్న వెలుగులు 
పంచి పుడమికి వేకువను 
కాంచనమయం చేయాలని

ఇనుడు వచ్చే దారిని 
ఇంపుగా రంగులతో 
ఇష్టంగా రంగవల్లులు నింపి 
ఇరుగడల నిలిచి స్వాగతించు

పాలమబ్బుల జాడ 
కాన రాకుండా  చేసి 
ఆటలాడే అల్లరి 
ఆపమని వేడె అవని

అడ్డులెన్ని వచ్చినా 
అరుణోదయమాగునా?
అణువణువూ  స్పర్శించే 
అభిమానము ఆపునా?

ప్రభాత సమయాన 
ప్రభవించు ప్రభాకరుని 
ప్రభలు చూచి మురిసి 
ప్రణమించు పృథ్వి...

దివాకరుని రాకకై  
దిగులుగా ఎదురుచూచు 
ధరణి  కోరిక తీరగా 
అరుదెంచు ఆదిత్యునికి 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు