అనగనగా ఒక పల్లెటూరు ఉండేది. ఆ గ్రామంలో చెట్లు ఎక్కువగా ఉండవు ఎందుకంటే అక్కడికి పొయిల కట్టె ల కోసం పక్క పల్లెటూరి వారు వచ్చి చెట్లను కొట్టుకు పోయేవారు. దానివలన ఆ ఊరిలో ప్రజలకు చాలా రకాల జబ్బులు వచ్చేవి. జబ్బులతో హాస్పటల్ కి వెళ్ళినటువంటి ప్రజలకు డబ్బులు ఎక్కువగా ఖర్చు అవేవి. ఈ విషయాన్ని ఊర్లో ఉన్న పెద్దలు ఆలోచన చేశారు ఎందుకు మన ఊరిలో ప్రజలకు ఇలా జబ్బులు వస్తున్నాయని ఆలోచించారు. అప్పుడు వాళ్లకు తెలిసిన విషయమైందంటే ఊర్లో చెట్లు లేకపోవడం వలన మంచి గాలి లేక ప్రజలకు రోగాలు వస్తున్నాయి అని తెలుసుకోవడం జరిగింది. అప్పుడు ఊర్లో ప్రజలందరూ కలిసి ఒక చాటింగ్ కు వేసి ఊర్లోని ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో మూడు చెట్లు పెంచాలి అని ఒక తీర్మానం చేశారు. అప్పుడు ఊర్లో ఉన్న వాళ్లంతా కలిసి ప్రతి ఒక్కరూ ఎవరింట్లో వాళ్లు ఒక మూడు నాలుగు చెట్లు నారడం జరిగింది అలా కొన్ని సంవత్సరాలకు ఆరు మొత్తం పచ్చదనంతో నిండి మంచి గాలి వాతావరణం ఏర్పడి ప్రజలంతా రోగాల నుండి బయటపడ్డారు. ఇప్పటినుండి ఆ ఊరి ప్రజలు అందరూ చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో చెట్లను పెంచాలి. మనం పెంచితే అవి మనలని ఆరోగ్యంగా ఉంచుతాయి. మనం ఆరోగ్యంగా ఉంటే మనకు ఎంతో ధన ము ఉన్నట్టే.
నీతి : చెట్లను పెంచి కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి