అనగనగా ఒక ఊరు ఆ ఊరు పేరు రంగాపురం. ఆ ఊరిలో ముగ్గురు పిల్లలు ఉండేవారు వారి పేరు రవి భాస్కర్ కిరణ్. రవి భాస్కరావు ఊరిలో పెద్ద కులానికి చెందినవారు. కిరణ్ దేమో మాత్రం చిన్న కులం. ఇద్దరు కిరణ్ ను ఎప్పుడు తిడుతూ ఉండేవారు. కానీ కిరణ్ మాత్రం వాళ్లని ఏం పట్టించుకోకుండా బాగా చదివేవాడు అన్ని సబ్జెక్టులో ఎప్పుడు మొదటి స్థానంలో ఉండేవాడు. కానీ వీళ్ళు రోజు బడిలో పక్కపక్కనే కూర్చునేవారు, కానీ అప్పుడప్పుడు రవి మా పక్కన ఎందుకు కూర్చుంటున్నావు కిరణ్ అంటుండేవాడు. కిరణ్ మాత్రం వాళ్ల మాటలు ఏం పట్టించుకోకుండా బాగా చదివే వాడు. అయితే ఒక రోజు కిరణ్ రోజు కూర్చున్న చోటు లోనే కూర్చున్నాడు. కానీ ఆరోజు రవి కిరణ్ ని మా పక్కన ఎందుకు కూర్చున్నావు అని అతనిని చెంప మీద కొట్టాడు. అప్పుడు కూడా ఏం పట్టించుకోకుండా నడుచుకుంటూ అందరికీ దూరంగా ఒక మూలన కూర్చున్నాడు. ఇలా రోజులు సంవత్సరాలు గడిచాయి. కిరణ్ పెద్దవాడయ్యాడు కిరణ్ చదువు కూడా పూర్తి అయింది. అన్నింటిలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు కిరణ్, కానీ రవి భాస్కర్ చదువులో చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకోలేకపోయారు. రవి కిరణ్ తో ఒకరోజు ఇలా అన్నాడు నీకు ఇన్ని మార్కులు వచ్చాయంటే నేను నమ్మను నవ్వు చిట్టీలు కొట్టి అన్ని మార్కులు తెచ్చుకున్నావు అని అందరి ముందు తక్కువ చేసి మాట్లాడాడు. అయినా కిరణ్ పట్టించుకోకుండా ఉన్నాడు. చాలా రోజులు సంవత్సరాలు గడిచాయి ముగ్గురివి ఫై చదువులు అన్ని అయిపోయాయి కానీ వారిద్దరి కంటే కిరణ్ కు మంచి మార్కులు రావడం వలన ముందుగా ఉద్యోగం వచ్చింది. కానీ భాస్కర్, రవికి తక్కువగామార్కులు రావడం వల్ల ఉద్యోగాలు రాలేదు. కిరణ్ కి ఉద్యోగం వచ్చిన విషయం భాస్కర్, రవికి తర్వాత తెలిసింది. కిరణ్ కి ఉద్యోగం రావడం, వారికి ఉద్యోగం రాకపోవడానికి కారణం ఏoదో వారు తెలుసుకున్నారు. చివరకు తప్పు తెలుసుకొని ఇద్దరు కిరణ్ దగ్గరికి వెళ్లారు. కిరణ్ తో రవి, భాస్కర్ మమ్ములను క్షమించు నిన్ను తక్కువ కులం అంటూ తక్కువ చేసి మాట్లాడాం. నిన్ను చాలా బాధ పెట్టాము అన్నారు. అప్పుడు కిరణ్ అది అంతా వదిలేయండి. మీరన్న మాట నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. అందుకే నేను బాగా చదవగలిగాను. అప్పుడు వారు కిరణ తో మేము చదువుకోకుండా ఎప్పుడూ నిన్ను బాధ పెడుతుండేది. అలా చేయబట్టే ఇలా అయింది మాకు అన్నారు. కిరణ్ మాత్రం ఏమి కాదు అదంతా వదిలేయండి అని అంటూ వారిని ఊరుకోమన్నాడు. అప్పటినుండి వాళ్లు ముగ్గురు అప్పుడప్పుడు కలుసుకుని మాట్లాడుకునేవారు.
నీతి :- మంచి మనసు ఉంటే ఎంత ఎత్తుకైనా చేరుకుంటారు. చదువు అన్ని కులాల వారు నేర్చుకోగలరు.
.
నీతి :- మంచి మనసు ఉంటే ఎంత ఎత్తుకైనా చేరుకుంటారు. చదువు అన్ని కులాల వారు నేర్చుకోగలరు.
.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి