రామయ్య! ఓ రామయ్య !:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
రామయ్యా ఓ రామయ్యా
మా దేవుడవే నీవయ్యా
ఓ అయోధ్య రామయ్యా
నీ సయోధ్య చూపయ్యా !

        రామయ్యా ఓ రామయ్యా 
        అందరి ప్రభువే నీవయ్యా
        మామాత  సీతారామయ్యా
         మానేతవు ఇక నీవయ్యా. !

రామయ్యా ఓ రామయ్యా
మా విభుడవు నీవయ్యా
ఓమా సుందర రామయ్యా
ఈ మందిరమే నీ దయ్యా !

        రామయ్య ఓ రామయ్యా
        మా ఇనుడవే  నీవయ్యా
        ఇక మాగనుఢవే నీవయ్యా
        నువు మాఇంటికి రావయ్యా!

రామయ్యా ఓ రామయ్యా
మా స్వామివి నీవేనయ్యా
మా మోరనే వినవయ్యా
జర మా దరికే రావయ్యా. !

         రామయ్యా ఓ రామయ్యా
         మా శ్రీ కరుడవు నీవయ్యా
         నీవు సరుగున రావయ్యా
         నీ కరుణను చూపయ్యా. !

రామయ్యా ఓ శ్రీరామయ్యా పురుషోత్తముడవు నీవయ్యా
మా మహిపాలుడవు నీవయ్యా
మీ మాయలను ఇక చూపయ్యా !

          రామయ్యా ఓ రామయ్యా
          రఘు రాముడవే నీవయ్యా
          అభిరాముడవూ నీవయ్యా
          అభయం నీవు ఇవ్వయ్యా !

రామయ్యా ఓ రామయ్యా
రామచంద్రుడవు నీవయ్యా
మహిపాలుడవు నీవయ్యా
మహినే నీవు ఏలావయ్యా  !

        రామయ్యా ఓ రామయ్యా
        రామరాజ్యం తెచ్చావయ్యా
        చల్లగా మమ్ము చూడయ్యా
         మెల్లగా మోక్షం ఇవ్వయ్యా  !

రామయ్యా ఓ శ్రీ రామయ్యా
ధనుంజయుడవు నీవయ్యా
మా దరిదాపుల్లోకి రావయ్యా
 నీవు దర్శనమిచ్చిపోవయ్యా !

రామయ్యా ఓ రామయ్యా
మా ఇలవేల్పువు నీవయ్యా
 హనుమను పంపితివయ్యా
  రావణుని చంపితివయ్యా. !

          రామయ్యా ఓ రామయ్యా
          మా దేవుడవు నీవేనయ్యా
          శ్రీరామ నామం మా మధవు
          శ్రీమతి సీతమ్మే  నీ వధువు!

రామయ్యా ఓ రామయ్యా
రవి వంశపు మా సోమయ్య
దశరథ పుత్రుడు నీవయ్యా
దశగల వాడవు నీవయ్యా. !


కామెంట్‌లు