ఏందిదీ! చెప్పుండ్రీ ?:- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
ఏందిదీ! 
చెప్పుండ్రీ?
ఇంత ఖరీదైన రోజుల్లో
ఈ ఉచిత (ఫ్రీ )బస్సుప్రయాణమేంది?!

ఏదో కాళ్ళు రెక్కలులేని
ముసలోళ్ళకో!
కుంటిగుడ్డోళ్ళకో!
ఆపూటకు లేక దూరాభారమైన పనికిపోయోచ్చే
కూలోళ్ళకో?
పెడితే బాగుండు!
అదీ బియ్యంకారటున్నోళ్ళకిస్తే
బాగుండు

ఏందిదీ చెప్పు?
సర్కారు కొలువు చేసే
మేడమ్మకు కూడా ఉచితప్రయాణమేనాయే
ఏందిదీ చెప్పుండ్రీ?

మునుపే బస్సులకంపెనీ
నష్టాలల్లా ఉందంటిరి

ఇట్లా ఆడోళ్ళకు ఫ్రీటికెట్ ప్రయాణం ఇయ్యబడితిరి

ఇప్పుడు ప్రతీరోజూ బస్సుళ్ళ జనజాతర
మొగోళ్ళు ఎక్కెటట్టులేదు దిగేట్టులేదు
పల్లె బస్సు ,ఎక్స్ప్రెస్ రెండీట్లా
ఫ్రీ కిరాయి లేదని 
ఏచిన్నపనికైనా
 ఆడోళ్ళు పట్నంపోబట్టే

ఏందిదీ ?
చెప్పుండ్రీ!?
ఇంకొందరు ఊర్లళ్ళ అనుకోవట్టిరి
మొగోళ్ళుఓట్లెయ్యలేదా!?
 ఇప్పుడు ఏలే సారు
ఆడోళ్ళు ఒక్కరు ఓట్లేస్తేనే
గెలిచిండ్రా!
మేము ఓట్లేస్తిమి గదా!
మాకు కూడా ఫ్రీ టిక్కెట్ పెట్టాలే

సర్కారు ఖా(కా)నూను ప్రకారం
ఆడోళ్ళు మొగోళ్ళు ఇద్దరు
సమానమే కదా!
అని అనుకోబట్టిరి

ఏమో ఈ పథకం ఎందుకు వెట్టిండ్రు వాళ్ళు గెలువనీకే గదా!
గెలిచే 
ఇప్పుడు 

ఖజానా కూడా చూసుకోవాలెగదా!
ఒక్కసారి ఆలోచించుండ్రీ
సంపద పెంచినంక 
ప్రజలకు పంచితే తప్పులేదు
కానీ
అప్పుల్లోఉన్నప్పుడు ఇట్టాంటివి
ఏందో మరీ 
లోగుట్టు దేవునికెరుక
అని అందరూ గుసగుస పెట్టుకోబట్టిరి
జరసోంచాయించుండ్రీ సార్లు 
ప్రజాపాలన నందించుండ్రీ 
ప్రజాభిమానం పొందండి
తెలంగాణ అభివృద్ధికి బాటలు వేయండి

కామెంట్‌లు