కవిమిత్రులారా
మనమంతా ఒకే తల్లి పిల్లలం కాకపోవచ్చు
కానీ
మనమంతా సమకాలీకులం
మన కవితా వస్తువు సమకాలీనమవ్వాలి
ఇప్పుడు మనందరి కవితా ప్రక్రియలు వేర్వేరు కావొచ్చు
మనందరి లక్ష్యం సామాజిక చైతన్యమే
ఒకరు పద్యం గేయం వచనం వ్రాయోచ్చు
మన కవితారీతేదైనా
ప్రజాశ్రేయస్సేకవులపరమావధి
ఇక్కడ సమ్మేళనంలో పాల్గొన్న
కవులు కవయిత్రులు అందరు
ఒక్కొక్కరు ఒక్కో సాహితీ ప్రక్రియలో లబ్దప్రతిష్టులుకావొచ్చు
మనమందరం ఇతివృత్తాన్ని సంగ్రహించినది సమాజంనుండేగదా!?
సీనియర్ కవులు
జూనియర్ కవులన్న భేదభావన
మన మధ్య ఉండొద్దు
మన సహచరకవులందరిని ప్రోత్సహిద్దాం
మనదంతా కవికులమని
మనది విశ్వమానవకులమని
నినదిద్దాం
బంగారం పుటం పెడితేనే వన్నెదేలుతుంది
కవి పురిటి నొప్పులు పడితేనే మంచి కవిత పురుడుపోసుకుంటుంది
కవిత్వం అంటే ఉబుసుపోని మాటలగారడీకాదు
కవిత అంటే కదిలేది కదిలించేది పెనునిద్దరవదిలించేది
రాజకీయాల్లోని స్వార్థపరత్వాన్ని బట్టబయలు
చేసేదే కవిత
సంఘమందలి అంథవిశ్వాసాలను రూపుమాపేదే కవిత
కులమత వర్గవర్ణవైషమ్యాలను
నిరసించేదే కవిత
నవమార్గంచూపునది నవజీవనమిచ్చునదే అసలుసిసలైన కవిత
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి