ఉంటేనే ఉండు విలువ:- -గద్వాల సోమన్న,-9966414580
=పూలలోన మకరందము
మాలలోన చక్కదనము
ఉంటేనే ఉండు విలువ
జీవితాన సంస్కారము

పాటలోన తీయదనము
మాటలోన మంచితనము
ఉంటేనే ఉండు విలువ
మనసులోన మేలి గుణము

అందమైన దరహాసము
ఘనమైన స్నేహబంధము
ఉంటేనే ఉండు విలువ
మెదడులోన విజ్ఞానము

స్వచ్ఛమైన ప్రేమగుణము
అందరితో సమభావము
ఉంటేనే ఉండు విలువ
చూపిస్తే మనిషితనము

సజ్జనుల సహవాసము
దుష్టులకు బహు దూరము
ఉంటేనే ఉండు విలువ
కన్నవారిపై గౌరవము


కామెంట్‌లు