హితోక్తుల హారాలు:- -గద్వాల సోమన్న,-9966414580
నైరాశ్యము హానికరము
వదిలేస్తే క్షేమకరము
ఆశావాద దృక్పథము
ఎంతైనా లాభకరము

అహర్నిశలు చింతిస్తే
చెడిపోవును ఆరోగ్యము
ఆదిలోన అణచేస్తే
ఉదయించును ఆనందము

మేలు కాదు పిరికితనము
అందు లేదు గొప్పతనము
తక్షణమే తరిమేస్తే
జీవితాల్లో విజయము

జీవితమే పోరాటము
అంతులేని ఆరాటము
జాగ్రత్తగా ఉండాలి
విజయ తీరము చేరాలి

ఎదిగితే ఒదిగుండాలి
సంస్కారమే పండాలి
వయసులో పెద్ద వారికి
గౌరవమే ఇవ్వాలి


కామెంట్‌లు