ఇదీ ...అది ..!!: --డా.కె.ఎల్.వి.ప్రసాద్.

 కోనసీమలో -
ఎక్కడో.....
ఒకప్రాంతం ...
అక్కడ-
ఎటుచూసినా 
చిక్కని-
పచ్చదనం !
వరిపొలాలతతో 
కొబ్బరితోటలతో 
పంట కాలువలతో,
నిత్యం --అక్కడ 
పచ్చజండా -
ఎగురుతుంటుంది !
కష్టజీవులకు 
కడుపు నింపుతుంది ,
భూస్వాముల గాదెలు 
నిండు గర్భిణులవుతాయి !
వర్షాకాలం వస్తే మాత్రం 
రోడ్లన్నీ ....
గుంతల మయం ....!
ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి ,
కాదామరి ....ఇది 
నిలువెత్తు సంతకం ....!!
            ***
కామెంట్‌లు